Skip to main content

Agricultural Courses: వ్యవసాయ కోర్సుల సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు ఖరారు..

వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లోని సెల్ఫ్‌ ఫైనాన్స్ ఫీజును రూ.14 లక్షలుగా ఖరారు చేసినట్టు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
Agricultural Courses
వ్యవసాయ కోర్సుల సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు ఖరారు..

వివిధ కోర్సుల్లో మొత్తం 167 సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్ ఫీజులతో భర్తీ చేస్తారు. వాటిని కూడా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామని వర్సిటీ వెల్లడించింది. ఒకవేళ సెల్ఫ్‌ ఫైనాన్స్ సీట్లు మిగిలిపోతే వాటిని ఇతరత్రా పద్ధతిలో భర్తీ చేయబోమని స్పష్టంచేసింది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా బీఎస్సీ అగ్రికల్చర్, ఉద్యాన, వెటర్నరీ, పశుసంవర్థక, ఫిషరీస్‌ కోర్సులకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఉమ్మడి ప్రవేశాల నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశాయి. వాటికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ప్రకటించారు. దరఖాస్తులో పొరపాట్లను ఆన్ లైన్ లో సరిదిద్దుకోవడానికి సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 3 వరకు అవకాశం కలి్పంచారు. జనరల్‌ కేటగిరీలో ప్రవేశం పొందేవారు ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ కేటగిరీ విద్యార్థులు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. వ్యవసాయ, ఉద్యాన సీట్లల్లో 40 శాతం, వెటర్నరీ కోర్సుల్లో 25 శాతం రైతు కోటా అమలు చేస్తారు. తల్లిదండ్రుల పేరున లేదా విద్యార్థి పేరున ఎకరాకు తక్కువ కాకుండా సొంత భూమి ఉండాలి. అలాగే కనీసం నాలుగేళ్లు గ్రామాల్లో (నాన్ మున్సిపల్‌ ప్రాంతాల్లో) ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివి ఉన్నవారికి రైతు కోటా వర్తిస్తుంది. ఇతర రిజర్వేషన్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్ 10 శాతం ఉంటుంది.

ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు...

  • బీఎస్సీ అగ్రికల్చర్‌ నాలుగేళ్ల కోర్సును ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందజేస్తుంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, జగిత్యాల జిల్లాలోని పొలాస, నాగర్‌కర్నూలు జిల్లాలోని పాలెం, హన్మకొండ జిల్లా, సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ కళాశాలల్లో మొత్తం 432 సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. వాటిల్లోని 132 సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సీట్లనూ భర్తీ చేస్తారు. 
  • బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ నాలుగేళ్ల కోర్సుకు సంబంధించి సైఫాబాద్‌ కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో 30 సీట్లు ఉన్నాయి. వాటికితోడు 5 సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సీట్లు కూడా భర్తీ చేస్తారు. 
  • పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లా కోరుట్ల, హన్మకొండ జిల్లా మామ్‌నూర్‌ వెటర్నరీ సైన్స్ కాలేజీల్లోని 158 సీట్లను భర్తీ చేస్తారు. 
  • ఫిషరీస్‌ సైన్స్ కోర్సుకు సంబంధించి వనపర్తి జిల్లా పెబ్బేర్‌ ఫిషరీ సైన్స్ కాలేజీలో 25 సీట్లు, ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్కూర్‌ ఫిషరీ సైన్స్ కాలేజీలో 11 సీట్లను భర్తీ చేస్తారు. 
  • శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్, వనపర్తి జిల్లా మోజెర్ల గ్రామంలోని ఉద్యాన కళాశాలల్లో 170 సీట్లను, వాటిలోని 30 సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సీట్లనూ భర్తీ చేస్తారు. 

ఫీజుల వివరాలు

  • బీఎస్సీ వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్ లకు ఫీజు రూ.37,840
  • వెటర్నరీ, పశుసంవర్థక కోర్సుల ఫీజు రూ. 48,230
  • ఫిషరీస్‌
  • కోర్సుల ఫీజు రూ. 36,810
  • ఉద్యాన కోర్సుల ఫీజు రూ. 43,400

చదవండి:

ANGRAU: ఏపీ అగ్రిసెట్–2021లో మెరిసిన తెలంగాణ అభ్యర్ధులు

EAPCET:నేడు ఏపీ ఎంసెట్‌(ఈఏపీసెట్‌ - అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్) ఫలితాలు విడుదల...సాక్షి ఎడ్యుకేష‌న్‌లో ఫ‌లితాలు

Published date : 17 Sep 2021 03:56PM

Photo Stories