ANGRAU: ఏపీ అగ్రిసెట్–2021లో మెరిసిన తెలంగాణ అభ్యర్ధులు
Sakshi Education
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్–2021 ఫలితాలను సెప్టెంబర్ 15న వీసీ డాక్టర్ అదాల విష్ణువర్ధన్ రెడ్డి లాంఛనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 జిల్లాల్లోని 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, 2,703 మంది నమోదు చేసుకుని 2,570 మంది హాజరైనట్టు తెలిపారు. వారిలో 2,538 మంది అర్హత సాధించారని చెప్పారు. అధిక మార్కులు సాధించిన వారిలో బీఎస్సీ హానర్స్ వ్యవసాయం కోర్సులో వ్యవసాయ పాలిటెక్నిక్ నుంచి అల్లు రమ్య(మార్టేరు), నంబూరి ప్రసాద్(తణుకు), గుదేటి సురేంద్రవర్మ(గరికపాడు)లు ఉండగా, విత్తన సాంకేతిక పరిజా్ఞనం పాలిటెక్నిక్ నుంచి చందా అనున్య(తెలంగాణ), వన్నెల భూమరాజు(తెలంగాణ), కొండపర్తి రమ్యశ్రీ(తెలంగాణ) ఉన్నట్టు తెలిపారు. సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ నుంచి మువ్వల గంగాభవాని(చింతపల్లి), లాలం దేవి(చింతపల్లి), గొల్లపల్లి గీతాసాయి(చింతపల్లి) ఉన్నట్టు వీసీ విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు.
చదవండి:
Published date : 16 Sep 2021 03:27PM