‘Seed Future Made in 3D’ కార్యక్రమంలో విద్యార్థినుల ప్రతిభ
Sakshi Education
స్టేషన్‌ఘన్‌పూర్: ‘సీడ్ ఫ్యూచర్ మేడ్ ఇన్ త్రీడీ’ కార్యక్రమానికి స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ భారత ప్రభుత్వం, లాఫౌండేషన్ డీ సాల్ట్ సిష్టం సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో వారు పాల్గొంటారని డీఈఓ రాము తెలిపారు. ఎంపికైన విద్యార్థినులు చైతన్య, వాసవి, అక్షర, శివాంజలి, సౌమ్య, హర్షితలను పాఠశాల ఆవరణలో హెచ్‌ఎం అజామొహీనొద్దీన్ సెప్టెంబర్ 15న అభినందించారు. అటల్ ల్యాబ్ ఇన్‌చార్జ్ సత్యప్రకాష్, ఉపాధ్యాయురాలు శైలజ పాల్గొన్నారు.
చదవండి:
ఉన్నత విద్యా సంస్థల్లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు
అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం పుస్తకావిష్కరణ
Published date : 16 Sep 2023 03:20PM