Skip to main content

అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం పుస్తకావిష్కరణ

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి(డిసెంబర్ 25) సందర్భంగా దేశప్రజలు ఆయన్ను ఘనంగా స్మరించుకున్నారు.
Current Affairs
న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాజ్‌పేయికు అంజలి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో డిసెంబర్ 25న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశంలో ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం’’ అనే పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. లోక్‌సభ సెక్రటరియేట్ రూపొందించిన ఈ పుస్తకంలో వాజ్‌పేయి లోక్‌సభలో చేసిన ప్రసంగాలు, వాజ్‌పేయి అరుదైన ఫొటోలను పొందుపరిచారు. వాజ్‌పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా పాటిస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్‌హాల్
ఎందుకు : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి(డిసెంబర్ 25) సందర్భంగా
Published date : 26 Dec 2020 05:53PM

Photo Stories