Skip to main content

Schools Summer Holidays Extended 2023 : గుడ్‌న్యూస్‌.. జూన్ 26వ తేదీ వరకు వేసవి సెలవులు పొడిగింపు.. కార‌ణం ఇదే..! తెలుగు రాష్ట్రాల్లో కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. మే నెల దాటి జూన్ నెల వ‌చ్చిన‌ప్ప‌టికి కూడా భ‌య‌టికి రావాలంటే.. జ‌నాలు భ‌యం ప‌డుతున్నారు. అలాగే పగటి ఉష్ణోగ్రతలతో పాటు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.
Schools Summer Holidays Extended 2023 News Telugu
Schools Summer Holidays Extended 2023 Details

నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ వరకు సెలవులను పొడిగించాలని సీఎం విద్యాశాఖకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో పేరెంట్స్, స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో..

school holidays news telugu

జూన్ నెల మధ్యలోకి వచ్చినా.. ఇంకా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ అనేక చోట్ల కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లను తిరిగి ప్రారంభించడం పేరెంట్స్ లో ఆందోళన పెంచుతోంది. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పటికే స్కూళ్లను ప్రారంభించారు. ఎండ కారణంగా వేసవి సెలవులను కనీసం ఓ వారమైనా పొడిగించాలని పేరెంట్స్ కోరినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో అనేక మంది తమ పిల్లలను ఇంకా స్కూళ్లకు పంపించడం లేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో..

వాస్తవానికి రాష్ట్రంలో జూన్ 16వ తేదీ నుంచి వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు ప్రారంభించాల్సి ఉంది. అయితే.. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వేసవి సెలవులను మరో 10 రోజులు పొడిగించాలని ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 26 నుంచి స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండవేడితో చిన్నారులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

➤☛ Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రైవేటు స్కూళ్లు కూడా..
తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా భారీగా ఉష్ణోగ్రతల నేపథ్యంలో స్కూళ్లను ఇంకా ప్రారంభించలేదు. మొదట జూన్ 14వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు.. మరో 2 రోజుల పాటు సెలవులను పొడిగిస్తున్నట్లు పేరెంట్స్ కు మెసేజ్ లు పంపిస్తున్నాయి.

➤☛ Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

2023-24 సంవ‌త్స‌రంలో స్కూల్స్‌కు సెల‌వులు ఇవే..

ts schools holidays details 2023-24 telugu news

తెలంగాణ విద్యాశాఖ‌ 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించింది. అలాగే సెల‌వుల వివ‌రాలు కూడా ప్ర‌క‌టించింది.

➤☛ Schools Summer Holidays 2023 : పాఠ‌శాల‌ల వేస‌వి సెలవులు పొడిగింపు.. విద్యాశాఖ ఇచ్చిన‌ క్లారిటీ ఇదే.. ఈ ఏడాది సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..

2023-24 అకడమిక్ ఇయర్‌లో ప‌రీక్ష‌లు- సెల‌వులు ఇవే..
☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కూల్ అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ఇదే..

ap shcools holidays list 2023-24 telugu news

జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌ స్కూల్ అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24ను విడుద‌ల చేశారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించారు. 

➤☛  ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఏపీలో ఈ ఏడాది సెల‌వులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

➤☛ School Education Department: బడికి రప్పించేలా రవాణా చార్జీలు

Published date : 15 Jun 2023 05:41PM

Photo Stories