Skip to main content

Summer Holidays 2023 : గుడ్‌న్యూస్.. రేప‌టి నుంచే వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ప్ర‌భుత్వం ప్రకటించింది. ఏడాదిపాటు తరగతులు, హోంవర్క్‌లు, ట్యూషన్లు, పరీక్షలతో సతమతమైన పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
summer holidays in telangana 2023 news telugu
summer holidays in telangana 2023 details

రాష్ట్రంలో బడులకు సోమవారమే ఆఖరి రోజు. మంగళవారం నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. సోమవారం పేరెంట్‌, టీచర్‌ సమావేశాలు జరుగుతాయి. ఇదేరోజు విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేస్తారు. 

మొత్తం ఎన్ని రోజులు సెల‌వులంటే..?

TS Schools holidays details 2023

గత రెండేండ్లు కరోనా కల్లోలంతో విద్యా సంవత్సరానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఒమిక్రాన్‌ ఆందోళనలు వ్యక్తమైనా.. దాని ప్రభావం అంతగా లేకపోవడంతో విద్యాసంవత్సరం సజావుగానే ముగిసింది. ఈ వేసవిలో 48 రోజుల పాటు బాలలు సెలవుల్లో మునిగి తేలనున్నారు. ఒక వేళ ఆ స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త ఎక్క‌వ‌గా ఉంటే ఈ సెల‌వుల‌ను పొడిగించే అవ‌కాశం ఉంది. ఇన్నిరోజుల దినచర్యకు భిన్నంగా వారికి ఈ సెలవుల్లో వెసులుబాటు కలుగుతుంది. ఈ సెలవులను బాలలు మరుపురాని అనుభూతులుగా మార్చుకోవచ్చు.

➤ AP & TS 10th Class Study Material PDF 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్ ( TM & EM)

బడులు తిరిగి ఎప్పుడు పునఃప్రారంభం అంటే..

ts summer holidays news telugu

పాఠ‌శాల‌లు.. సెలవుల అనంతరం జూన్‌ 12న తెరుచుకుంటాయి. జూన్‌ మొదటివారం నుంచే బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచే బడులు తెరుచుకోనుండగా, విద్యాసంవత్సరం మాత్రం జూన్‌ 12 నుంచే ప్రారంభంకానుంది. ఈ సెలవు రోజుల్లో మన ఊరు – మన బడి, మన బస్తీ కార్యక్రమ పనులను శరవేగంగా పూర్తిచేయాలని, మరమ్మతులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

ఈ సెలవుల్లో మీ పిల్లలను..
ఈ రోజుల్లో ప్రతి ఇంటా సెల్‌ఫోన్‌ ఫోబియా పట్టి పీడిస్తున్నది. ఈ సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌ ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. పత్రికలు, పుస్తక పఠనం వైపు దారి మళ్లించాలి. గ్రంథాలయాలను వారికి పరిచయం చేయడమే కాదు అలవాటుగా మలచాలి. బంధుత్వాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను నేర్పించాలి. క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవ వికాసం వైపు మళ్లేలా వారికి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే శిక్షణను ఇప్పించాలి. చేతిరాత శిక్షణ ఇప్పించి భవిష్యత్తు రాతను వారితోనే గీయించాలి.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

2023లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..

 

సాధారణ సెలవులు ఇవే..

holidays list 2023

☛ జనవరి 1 : నూతన సంవత్సరం
☛ జనవరి 14 : భోగి
☛ జనవరి 15 : సంక్రాంతి
☛ జనవరి 26 : గణతంత్ర దినోత్సవం
☛ ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి
☛ మార్చి 7 : హోళీ
☛ మార్చి 22 : ఉగాది
☛ మార్చి 30 : శ్రీరామనవమి
☛ ఏప్రిల్ 5 : బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
☛ ఏప్రిల్ 7 : గుడ్ ఫ్రైడే
☛ ఏప్రిల్ 14 : అంబేడ్కర్‌ జయంతి
☛ ఏప్రిల్ 22 :  రంజాన్‌
☛ ఏప్రిల్ 23 : రంజాన్ తదుపరి రోజు
☛ జూన్ 29 : బక్రీద్
☛ జులై 17 : బోనాలు
☛ జులై 29 : మొహర్రం
☛ ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం
☛ సెప్టెంబరు 7 : కృష్ణాస్టమి
☛ సెప్టెంబరు 18 : వినాయక చవితి
☛ సెప్టెంబరు 28 :  మిలాద్‌-ఉన్‌-నబి
☛ అక్టోబర్ 2 :   గాంధీ జయంతి
☛ అక్టోబర్ 14 : బతుకమ్మ ప్రారంభం
☛ అక్టోబరు 24 : విజయదశమి
☛ అక్టోబరు 25 : విజయదశమి తర్వాతి రోజు
☛ నవంబర్ 12 : దీపావళి
☛ నవంబర్ 27 : కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
☛ డిసెంబరు 25 : క్రిస్మస్
☛డిసెంబర్ 26 : బాక్సింగ్ డే

చదవండి: ఇంటర్  స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..

holidays details

Tealangana Holidays 2023TS Government Holidays 2023Holidays Newsholidays news telugu

☛ Telangana 10th Class Results 2023 Date : తెలంగాణ 'ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు' విడుద‌ల ఎప్పుడంటే..?

Published date : 24 Apr 2023 03:58PM

Photo Stories