Skip to main content

Schools Holidays Due to Heavy Rain : భారీ నుంచి.. అతి భారీవర్షాలు.. స్కూళ్లకు సెలవులు..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. రాష్ట్రంలో వారం రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా విద్యాశాఖ అధికారులు స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు.
Schools Holidays Due to Heavy Rain News Telugu News
Schools Holidays Due to Heavy Rain

అలాగే రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అలాగే విద్యార్థుల త‌ల్లిదండ్రులు మీ ప్రాంతంలో ప‌డే వ‌ర్షాన్ని బ‌ట్టి మీ పిల్ల‌ల‌ను స్కూల్స్ పంపాలో వ‌ద్దో మీరే నిర్ణ‌యం తీసుకోండి.మహారాష్ట్ర, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండ‌డీ(IMD) జూలై 20 , 21, 2023 తేదీలలో తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరికను జారీ చేసింది.

☛ August 29, 30 Schools and Colleges Holidays : ఆగస్టు 29,30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

రేపు స్కూల్స్‌కు సెల‌వులు..?

schools holidays due to rain telugu news

రేపు తెలంగాణ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణ పాఠశాలల మూసివేతకు సంబంధించిన అధికారిక వార్తను రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప‌రిస్థితి బ‌ట్టి.. వర్షాలు ఉన్న ప్రాంతాన్ని బ‌ట్టి స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి , మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల , పెదపల్లి, మంచిర్యాల , ఆదిలాబాద్ , జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్‌డీపీఎస్) పేర్కొంది. వర్షపాతం కారణంగా పాఠశాలలకు సెలవుల‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

జూలై 21 వరకు..

schools holidays telugu news

జూలై 21 వరకు రాయ్‌గఢ్‌లో ఆరెంజ్ హెచ్చరిక కొనసాగ‌నున్న‌ది. పాల్ఘర్ , థానే జిల్లాలు జూలై 20 వరకు వర్షాలు పడే సమాచారం ఉంది. అధికారులు స్థానికులను ఇంట్లోనే ఉండమని బయటికి వెళ్లకుండా ఉండాలని ప్రోత్సహించారు. యమునా నదికి వరదలు పెరుగుతున్నందున, ఢిల్లీలోని పాఠశాలలు కూడా జూలై 18 వరకు మూసివేసిన విష‌యం తెల్సిందే.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

​​​​​​​తెలంగాణ‌లో 2023-24 సెల‌వులు ఇవే..
☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

Published date : 19 Jul 2023 07:31PM

Photo Stories