Skip to main content

Scholarships: వెనుకబడిన విద్యార్థినులకు ఉపకార వేతనాలు

కొరుక్కుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న వెనుకబడిన కులాల బాలికలకు ఏడాదికి రూ.4వేలు అందజేస్తామని చెన్నై కలెక్టర్‌ తెలిపారు.
 Eligibility Criteria for Educational Assistance   Scholarships for Backward Classes girl students   Korukkupet Collector Announces Educational Grant

కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాల విద్య గ్రాంట్‌ పథకం కింద అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ పథకం కింద లబ్ధిదారుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. అర్హులైన విద్యార్థినులందరికీ విద్యా సహాయంగా సంవత్సరానికి రూ.4 వేలు అందిస్తారు.

చదవండి: Scholarships: ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే రూ. 40 వేలు అంద‌జేత..

ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు 9, 10 తరగతి విద్యార్థులు తమ పేరు మీద బ్యాంకు ఖాతాను జాతీయ బ్యాంకులు లేదా పోస్టల్‌ బ్యాంకుల్లో తెరవాలి. వారి ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేయాల్సి ఉంటుంది. గ్రహీత వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ కాపీలతో పాటు ఆధార్‌ నంబర్‌, బ్యాంకు వివరాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి.

చదవండి: Jagananna Videshi Vidya Deevena: పేదల ఉన్నత చదువు కోసమే ‘విదేశీ విద్యా దీవెన’

ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థినుల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలని, మరిన్ని వివరాల కోసం విద్యార్థినులు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని చెన్నై జిల్లా కలెక్టర్‌ కోరారు.

Published date : 08 Jan 2024 09:21AM

Photo Stories