High Court: హాస్టల్ వసతులపై 3 వారాల్లో నివేదికివ్వండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో ప్రస్తుతం ఉన్న వసతులపై 3 వారాల్లో నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్–2018 ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో వసతులు కల్పించడం లేదని.. బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు, వార్డెన్లు తదితర వసతులు ఉండాల్సిన నిష్పత్తిలో లేవని పేర్కొంటూ హైదరా బాద్‌కు చెందిన కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
చదవండి: High Court: ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోటా చెల్లదు
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం డిసెంబర్ 18న మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. వసతుల ఏర్పాటుపై నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
Published date : 19 Dec 2023 11:45AM