TRR: మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ సీట్ల రెన్యువల్
ఈ మేరకు కాలేజీ డీన్‌కు లేఖ రాసింది. 2023–24 వైద్య విద్యా సంవత్సరంలో వాటిని భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇది ఏడాది వరకే పరిమితమని పేర్కొంది.
చదవండి: Telangana Medical Seats: తెలంగాణలో 700 మెడికల్ సీట్లు పెరిగే చాన్స్.... పూర్తి వివరాలు ఇవే
కొత్తగా మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి...
ఈ ఏడాది రాష్ట్రంలో మూడు కొత్త ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతించింది. హైదరాబాద్‌లోని అరుంధతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ, సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు 2023–24 వైద్య విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయి. వరంగల్‌లోని ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తు తం వంద సీట్లు ఉండగా, ఈ ఏడాది మరో 50 సీట్లకు అనుమతిచ్చింది. ఆర్‌వీఎం మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉండగా, మరో వంద సీట్లకు అనుమతిచ్చింది.
చదవండి: Medical students: పాఠం వినడంతో పాటు ఇకనుంచి పరిశోధనలు