Telangana Medical Seats: తెలంగాణలో 700 మెడికల్ సీట్లు పెరిగే చాన్స్.... పూర్తి వివరాలు ఇవే
ఆర్వీఎం మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉండగా, అదనంగా మరో వంద సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఏడు కాలేజీల్లో కలిపి 850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 7,465కు పెరిగింది. ఇందులో 3,015 సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండగా, 4,450 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. మరో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాల్సి ఉంది.
చదవండి: పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.... త్వరలోనే రెగ్యలరైజేషన్.!
రెండేళ్లలో 3 వేల సీట్లు...!
ఒక్కో కాలేజీలో వంద సీట్లు ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఎంసీకి విజ్ఞప్తి చేసింది. వీటిల్లో ఎన్ఎంసీ తనిఖీలు పూర్తయ్యాయని, అన్ని కాలేజీలకు తప్పకుండా పర్మిషన్ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అంటే ఈ ఏడాదే మరో 700 సీట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి వస్తే మొత్తం సీట్ల సంఖ్య 8,165కు చేరుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి 2021 నాటికి 5,040 సీట్లు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసింది. వీటిల్లో 1,150 సీట్లు అందుబాటులోకి రాగా, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 375 సీట్లు వచ్చాయి. దీంతో గత అకడమిక్ ఇయర్లో సీట్ల సంఖ్య 6,615కు చేరింది. ఈ ఏడాది 850 సీట్లు యాడ్ అయ్యాయి. మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెబుతున్నట్లుగా ఇంకో 700 సీట్లు యాడ్ అయితే, రెండేళ్లలోనే 3,125 సీట్లు పెరిగినట్టవుతుంది.
చదవండి: ఆ మూడు పార్టీలకు ఈసీ షాక్... ఇన్ని సీట్లు వస్తేనే జాతీయ హోదా.!
నూతన కాలేజీల వారీగా మెడికల్ సీట్ల వివరాలు ఇలా....
- అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో 150 సీట్లు
- సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 150 సీట్లు
- ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 150 సీట్లు
- ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 సీట్లు
- కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 సీట్లు