BDS: ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ ల నమోదు ప్రారంభం.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
2021–22 సంవత్సరానికి బీడీఎస్ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్ ల నమోదుకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మార్చి 22న నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ ఆప్ష ల నమోదు ప్రారంభం
మార్చి 22 రాత్రి 9 గంటల నుంచి ఆప్షన్ ల నమోదుకు అవకాశం కల్పిం చారు. మార్చి 25 సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది. ఈ ఆప్షన్ల ఆధారంగానే అన్ని విడతల కౌన్సెలింగ్‌లలో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆప్షన్ ల నమోదులో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 74165 63063, 74162 53073, 83338 83934, 90635 00829 ఫోన్ నంబర్‌లలో సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు.