G Satish Reddy: సైన్స్ అండ్ టెక్నాలజీలో వేగంగా వృద్ధి
అక్టోబర్ 8న డిచ్‌పల్లిలోని జీ క న్వెన్షన్‌లో తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన రాష్ట్ర ఉన్నత వి ద్యామండలి చైర్మన్ రిక్క లింబాద్రితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పా ఠశాలల్లో పని చేస్తు న్న 150 మంది ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డులను అందజేశారు.
సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రపంచంలో సాప్ట్ వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని మన విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.యువత స్టార్టప్ కంపెనీలు ప్రా రంభించి ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు.
విద్యారంగంలో అనేక అవకాశాలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో అనేక అవకాశాలు పెరిగాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. కాలానుగుణంగా విద్యారంగంలో, సిలబస్ తయారీలో అనేక మార్పులు చేస్తున్న ట్లు తెలిపారు. ప్రస్తుతం కొన్ని కోర్సుల్లో చేరితే వారంలో 3 రోజులు కాలేజీలో, మరో 3 రోజు ల్లు కంపెనీలు, పరిశ్రమల్లో పని చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం ఉన్నత విద్యలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. డీఈవో దుర్గాప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ప్రసంగించారు. కార్యక్రమంలో ట్రస్మా రా ష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కా ర్యదర్శి మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు జయసింహాగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మానస గణేష్, విష్ణువర్ధన్, ఆర్‌ఏ జనార్దన్, నిత్యానందం, సుందర్, గంగారెడ్డి, విక్రాంత్, గంగాధర్ పాల్గొన్నారు.