Skip to main content

IN COME-17': మిశ్రధాతువులపై దృష్టిపెట్టాలి: రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రక్షణ, వైమానిక రంగాల్లో కీలకంగా మారుతున్న మిశ్రధాతువులపై శాస్త్రవేత్తలు తమ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముందని రక్షణమంత్రి శాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.
IN come 17 conference 2022
IN come 17 conference 2022

క్షిపణి, వైమానిక వ్యవస్థల్లో బరువును తగ్గించడం చాలా కీలకమైన విషయం కాబట్టి..ఆ పని చేయగల మిశ్రధాతువులను అభివృద్ధి చేసేందుకు పరిశోధన సంస్థలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిశ్రధాతువుల తయారీ, పరిశోధనల రంగాల్లోని తాజా పరిణామాలను చర్చించే లక్ష్యంతో మంగళవారం మొదలైన ‘ఇన్‌ కామ్‌ –17‘ సదస్సు ముఖ్యఅతిథిగా వీడియో ద్వారా సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ...రక్షణవ్యవస్థ శక్తి సామర్థ్యాల విషయంలో రాజీ పడకుండానే కొత్త మిశ్రధాతువుల అభివృద్ధి చేయాలని కోరారు. అదే సమయంలో కొత్త మిశ్రధాతువులు పర్యావరణ అనుకూలంగానూ ఉండేలా చూసుకోవాలని సూచించారు.  

Also read: Kaleshwara Project : 2 కొత్త కంట్రోల్‌ రూమ్స్‌

225 టన్నుల బయోప్లాస్టిక్‌ ఉత్పత్తి... 
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన బయో ప్లాస్టిక్‌ టెక్నాలజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ అందు బాటులో ఉందని..ఇప్పటికే 25 కంపెనీలద్వారా సుమారు 225 టన్నుల ఉత్పత్తి జరుగుతోందని ఇన్‌ కామ్‌ 17 ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డాక్టర్‌ వీరబ్రహ్మం వెల్లడించారు. మరో 45 కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీజీ ఎంఎస్‌ఎస్‌ డాక్టర్‌ బీవీహెచ్‌ ఎస్‌ మూర్తి, షార్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Nov 2022 03:47PM

Photo Stories