ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం
ఈమేరకు సమగ్ర శిక్ష విభాగం మే 31న మార్గదర్శకాలు విడుదల చేసింది. బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని బడిబాట పట్టించేందుకు జూన్ 3 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. గ్రామీణ శివారు ప్రాంతాల్లో 5 ఏళ్ల లోపు బడికి వెళ్లని విద్యార్థులను గుర్తించి, వారిని సమీప అంగన్‌వాడీల్లో చేర్పించాలని ఆదేశించింది. 5వ తరగతి పూర్తి చేసిన వారిని స్కూల్ మానకుండా చూడాలని, 7, 8 తరగతుల్లో వందకు వంద శాతం ఎన్‌రోల్ మెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు మండల, జిల్లా స్థాయి అధికారులతో యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి ఓ సమావేశం నిర్వహించాలని పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు–మన బడి, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనపై ప్రజల్లో అవగాహన కల్పించి, పిల్లలను స్కూళ్లలో చేర్చే విధంగా ప్రోత్సహించాలని సూచించింది. ఇందుకు సంబంధించి జూన్ నెలలో చేపట్టాల్సిన దినవారీ షెడ్యూల్‌ను సమగ్ర శిక్ష జిల్లా అధికారులకు పంపింది.
చదవండి:
మరో ఐదేళ్ల పాటు సమగ్ర శిక్షా పథకం అమలు
ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ద్వారా పాఠశాలల్లో.. స్మార్ట్, డిజిటల్ తరగతులు!