మరో ఐదేళ్ల పాటు సమగ్ర శిక్షా పథకం అమలు
Sakshi Education
పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ ఆగస్టు 4న నిర్ణయించింది.
అంగన్‌వాడీలకు శిక్షిణనిచ్చే మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణనివ్వడం, విద్యార్థినుల హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్ మెషీన్ల ఏర్పాటు, సీనియర్ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులను నేర్పించడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకూ విద్యాబోధన, తదితరాలను సమగ్ర శిక్షా పథకంలో భాగంగా అమలుచేయనున్నారు.
మరో రెండేళ్లు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు
389 పోక్సో కోర్టులుసహా దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. కోర్టుల నిర్వహణకు కేంద్రం తన వాటాగా రూ.971.70 కోట్లు ఖర్చుచేయనుంది. ‘నిర్భయ’ నిధి నుంచి కేంద్రం తన వాటా నిధులను అందజేయనుంది.

Published date : 05 Aug 2021 06:04PM