అన్ని జిల్లాల్లో NCC విస్తరణకు సన్నాహాలు
స్థానిక ఐతానగర్‌లోని ఎన్‌సీసీ 22వ ఆంధ్రా బెటాలియన్‌ను ఆగస్టు 2న ఆయన సందర్శించారు. నెలరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఎయిర్ కమొడోర్ మధుసూదనరెడ్డి ఎన్‌సీసీ కేంద్రాల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చారు.
ఎన్‌సీసీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. 2022–23 సంవత్సరంలో ఎన్‌సీసీ బెటాలియన్ కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్‌సీసీ కార్యకలాపాలు ఏవిధంగా జరుగుతున్నాయి...వాటిని మరింత మెరుగ్గా ఎలా చేయాలనే అంశంపై పరిశీలన చేస్తున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు.
చదవండి: ‘NCC’ కేడెట్లకు ఎయిర్‌వింగ్ శిక్షణ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాను ఇంతకుముందే కలిసినట్టు తెలిపారు. ఎన్‌సీసీ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన స్థలం సమకూర్చేందుకు ముఖ్యమంత్రి హామీనిచ్చినట్టు చెప్పారు. అకాడమీ ఏర్పాటుతో ఎన్‌సీసీ క్యాడెట్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో 60 వేలమంది విద్యార్థులు ఎన్‌సీసీలో ఎన్‌రోల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్‌సీసీ అధికారులు ఎ.ఉమాశంకర్, వి.మౌనిక, జి.హనుమంతరావు, సమ్యానాయక్, సర్దార్ పరిశా, కత్తి శ్రీనివాసరావు, కె.స్వామి, బాషా, గోపి, భిక్షాలు పాల్గొన్నారు.