పెద్ద చదువులకు పేదరికం అడ్డు కాకూడదు: సీఎం ట్వీట్
అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నామన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నామని తెలిపారు. నవంబర్ 30న ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మన లక్ష్యం 100 శాతం అక్షరాస్యత మాత్రమే కాదని, 100 శాతం పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా అని అన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా ఈ ఏడాది మూడవ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.686 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు.
చదవండి:
Higher Education: ఉన్నత విద్య కోర్సుల్లో సమ్మర్ స్కూల్ కాన్సెప్
Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!
Good News: విద్యార్ధులకు నైపుణ్యాలను పెంపొందించేలా ఉచిత శిక్షణ