TU: పరీక్షలు వాయిదా.. కారణం ఇదే!
గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్ష లు జరుగుతున్న దృష్ట్యా పీజీ పరీక్షలను విద్యార్థుల వినతి మేరకు ఆగస్టు 16 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ 2వ, 4వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, బీఎల్‌ఐఎస్సీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ఆగస్టు 16 నుంచి ప్రారంభమవుతాయన్నారు.
చదవండి: Naina Jaiswalకు డాక్టరేట్.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలు
సయ్యదా అమెనా మక్బూల్‌కు డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం పరిశోధక విద్యార్థిని సయ్యదా అమెనా మక్బూల్ డాక్టరేట్ సాధించారు. తెయూ ఉర్దూ విభాగం మాజీ ప్రొఫెసర్ అత్తర్ సుల్తానా పర్యవేక్షణలో ‘సయ్యద్ ఫాజిల్ హుస్సేన్ పర్వేజ్‌కి సహఫాతి ఖిద్మత్’ అనే అంశంపై అమెనా పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు.
ఆగస్టు 11న తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మినీ సెమినార్ హాల్‌లో నిర్వహించిన వైవావోస్‌కు ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ ప్రొఫెసర్ ఎస్‌ఏషుకూర్ ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. డాక్టరేట్ సాధించిన మక్బూల్‌ను శాలువాతో సత్కరించారు.
చదవండి: Chief Justice of India N.V. Ramana: జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్