Polasa Agricultural College: పొలాస విద్యార్థుల పొలంబాట
Sakshi Education
జైపూర్(చెన్నూర్): ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు పొలంబాట పట్టారు.
ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఫిబ్రవరి 21న జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ పంటపొలాలను పరిశీలించారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయిలో సేద్య విధానాలు, రైతులు సాగు చేస్తున్న పంటలు, వారి అనుభవాలు తెలుసుకున్నారు.
చదవండి: Sugarcane Molasses: చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం ఏమిటో తెలుసా..!
అనంతరం జైపూర్ రైతువేదికలో సామాజిక వనరుల గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తూలనం, ఫ్రెఫరెన్స్ ర్యాంకింగ్, సమస్యల చెట్టు, కాలక్రమం తదితర అంశాలపై ముగ్గులతో చిత్రాలు వేసి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివకృష్ణ, నాగరాజు, ఏడీఏ రాజేశం, ఏవో మార్క్‌గ్లాస్టన్, ఏఈవో కొమురయ్య, విద్యార్థులు హర్షిత్, సుశాంత్, శ్రీవత్స, రాంప్రసాద్, వివేక్ పాల్గొన్నారు.
Published date : 22 Feb 2024 03:32PM