NEET 2024: నీట్ ప్రశ్నపత్రం తారుమారు
వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు 323 మంది విద్యార్థులకు 299 మంది హాజరయ్యారు. పరీక్షకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలు జిల్లాకు పంపించారు. వీటిని పట్టణంలోని ఎస్‌బీఐ, కెనరా బ్యాంకుల్లో భద్రప రిచారు.
ఎన్‌టీఏ నుంచి అందిన మెయిల్ ప్రకారం ఎస్‌బీఐలో భద్రపరిచిన జీఆర్‌ఐడీయూ సెట్ ప్రశ్నపత్రం వినియోగించాల్సి ఉంది. జిల్లా అధికారులు కెనరా బ్యాంకులో ఉంచిన ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా జీఆర్‌ఐడీయూ సెట్ పేపర్‌తో పరీక్ష నిర్వహించగా.. జిల్లాలో ఎన్‌ఏజీఎన్‌యూ సెట్‌తో పరీక్ష రాయించారు.
చదవండి: Medical College Entrance Exam: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు గందరగోళం! అసలేం జరిగింది?
ఘటనపై ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దని, అధికారికంగా రెండు పేపర్లకు ‘కీ’ వస్తుందని ఎన్‌టీఏ అధికారులకు మెయిల్ పంపించి న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.