Skip to main content

High Court: వేలల్లో పెనాల్టీ ఫీజు సరికాదు

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్య అనేది విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దగల ఓ అద్భుత సాధనం.. అలాంటి విద్య విషయంలో పెనాల్టీ ఫీజు పేర విద్యార్థుల నుంచి వేలల్లో వసూలు చేయడం సరికాదు’అని హైకోర్టు అభిప్రాయపడింది.
Penalty fees in the thousands are not fair

పెనాల్టీ లేకుండా రెగ్యులర్‌ పరీక్ష రుసుము మాత్రం తీసుకొని పిటిషనర్‌ను అనుమతించాలని ఉస్మానియా వర్సిటీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విష యాన్ని తమ తీర్పుల్లో వెల్లడించాయని పేర్కొంది.

2017–18 సంవత్సరానికి సంబంధించి బ్యాక్‌లాగ్‌ ఉన్న ఓ విద్యార్థిని పరీక్ష ఫీజుతో పాటు రూ.10 వేలు అపరాధ రుసు ము కింద చెల్లించాలని యూనివర్సిటీ తెలిపింది. దీన్ని సవాల్‌ చేస్తూ కె.ప్రమోద్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఆకాశ్‌ బాగ్లేకర్‌ వాదనలు వినిపించారు.

చదవండి: Training for Teachers: ఉపాధ్యాయుల‌కు 'జ్ఞాన జ్యోతి' శిక్ష‌ణ ప్రారంభం

వర్సిటీ నిర్ణయాన్ని తప్పుబడుతూ పలు తీర్పులు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ, రెగ్యులర్‌ పరీక్ష రుసుము మాత్రమే తీసుకోవాలని వర్సిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఇలా అపరాధ రుసుము విధించే నిర్ణయంపై నాలుగు వారా ల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకోవాలని యూనివర్సిటీకి స్పష్టం చేశారు.  
 

Published date : 02 Nov 2023 10:56AM

Photo Stories