OU: ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ రెండు రోజుల జాతీయ సెమినార్
సంప్రదాయ బోధనా పద్దతుల నుంచి డిజిటల్ విప్లవం వైపుగా మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సీఈసీ నిధులతో "మ్యాసివ్ ఆన్ లైన్ కోర్సుల దృక్పథం - ఉన్నత విద్యా బోధనలో డిజిటల్ టెక్నాలజీ" అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సెమినార్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతకు సంప్రదాయ విద్యా బోధనకు తీవ్రమైన అంతరం ఉందని.... సవాళ్లను పరిష్కరించి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పరిష్కారాలు చూపాలని హితవు పలికారు.
చదవండి: Cheetah Sasha: అయ్యో.. నమీబియా నుంచి వచ్చిన ఆడ చీతా సాషా మృతి
విద్య ఉమ్మడి జూబితాలో ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ విద్యావిధానం ద్వారా విద్యారంగానికి ఉన్న ప్రయోజనాలను వివరించిన ప్రొఫెసర్ నడ్డా.... ఆధునిక విద్యాబోధనలతో ఉద్యోగావకాశాలు తగ్గుతాయన్న వాదనను కొట్టిపారేశారు. ప్రస్తుతం 27శాతంగా ఉన్న విద్యార్థుల నమోదు.. 2035 నాటికి 50 శాతం లక్ష్యాన్ని చేరుకోనుందని వివరించారు. డిజిటల్ విద్య ద్వారానే ఇది సాధ్యమవుతుందని... SWAYAM ద్వారా 40 క్రెడిట్ లతో కూడిన మూక్స్ కోర్సులను విద్యార్థులకు అందించాలని అన్నారు. విద్యా బోధనా లెర్నింగ్ ప్రక్రియలను ప్రారంభించటానికి స్వయం, మూక్స్, డాక్యమెంటరీలపై దృష్టిసారించాలని సూచించారు.
చదవండి: Global Crisis: ఎందుకు ఇన్ని కొలువులు పోతున్నాయ్... తాజాగా మరో 7 వేలమంది జౌట్.. ఎక్కడంటే
ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని సీఈసీ ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్నిప్రదర్శించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాత తరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ అన్నారు. విద్యా బోధన, లెర్నింగ్ లో వస్తున్న డిజిటల్ విప్లవంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్న ఈఎంఆర్సీ బృందాన్ని ఆయన అభినందించారు. సమకాలీన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఉస్మానియా విశ్వవిద్యాలయం చర్యలు తీసుకుంటోందని..... ఇప్పటికే టీసాట్ తో కలిసి ఉస్మానియా టీవీ ద్వారా విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించనున్నామని స్పష్టం చేశారు.
చదవండి: Hacking: యాంటీవైరస్‌ని ఇన్‌స్టాల్ చేయండి... మీ పాస్‌వర్డ్‌లను భద్రపరచుకోండి!
జాతీయ విద్యావిధానంలో డిజిటల్ విశ్వవిద్యాలయం ఆవశ్యకతను... ఇందుకు CEC, EMRCల పాత్రను CEC అదనపు డైరెక్టర్ రజనీష్ శ్రీవాస్తవ వివరించారు. విద్యారంగంలో డిజిటల్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రొఫెసర్. జె.బి. నడ్డా చేస్తున్న సేవలను కొనియాడారు.
చదవండి: First Digital Country: తొలి డిజిటల్ దేశంగా తువాలు
విద్యలో సాంకేతికత ఆవశ్యకతలను కొవిడ్ – 19 మరింత అవగతం చేసిందని ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనల్లో సాంకేతికత ఇంకా చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉందని అయితే.... డిజిటల్ బోధనలో మౌలిక వసతుల లేమిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. ఎలాంటి సాంకేతికతలు వచ్చినా సమాజంలో ఉపాధ్యాయుడిదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు.
విద్యారంగంలో వస్తున్న మార్పులపై మద్రాసు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గౌరి వివరించారు. అకడమిక్ పాలనలో అవరోధాలను అధిగమించటానికి సిఇసి డైరెక్టర్ ప్రొఫెసర్ జెబి నడ్డా చేసిన కృషి మరియు తాత్వికతను ఆయన అభినందించారు. డిజిటల్ విద్యలో అతను పవిత్ర బైబిల్ మరియు రామాయణ ఇతిహాసాల నుండి సారూప్యతలను వివరించారు.
చదవండి: Digital University: దేశంలో తొలిసారిగా డిజిటల్ యూనివర్సిటీ
సాంకేతిక పురోగతులు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయని, విద్యా రంగానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ మృణాళిని వెల్లడించారు. కృత్రిమ మేధస్సు భవిష్యత్ అభ్యాస పర్యావరణ వ్యవస్థలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.
రెండు రోజుల జాతీయ సదస్సుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో 260 మంది అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మూక్స్ రూపకల్పలో ఎదురైన అనుభవాలను ప్రొఫెసర్ శ్రీనగేశ్, ప్రొఫెసర్ చింతా గణేష్, ప్రొఫెసర్ స్వాతి, ప్రొఫెసర్ హరీశ్ గుప్తా, ప్రొఫెసర్ ఝాన్సీ తదితరులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.