Skip to main content

First Digital Country: తొలి డిజిటల్‌ దేశంగా తువాలు

సముద్ర మట్టాలు పెరిగి తమ దేశ భూభాగం కనుమరుగు అవుతుండటంతో ద్వీపదేశం తువాలు కీలక నిర్ణయం తీసుకుంది.
Tuvalu is the first digital country

భావితరాలకు సైతం వీరి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా తువాలు డిజిటల్‌ దేశంగా మారనుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఏటా చేస్తున్న తీర్మానాలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. కర్భన ఉద్గారాల కారణంగా నీటిమట్టాలు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో తమ దేశాన్ని డిజిటల్‌ దేశంగా మారుస్తామని తువాలు ఐలాండ్‌ ప్రకటించింది. ఆస్ట్రేలియా, హవాయిల మధ్య తొమ్మిది దీవుల సమూహంగా ఉన్న తువాలులో 12 వేల మంది జనం నివసిస్తున్నారు. 
ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా.. ప్రపంచంలో గ్లోబల్‌వార్మింగుకు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ది మంకీస్, కొళ్లైడర్‌ అనే రెండు సంస్థలు సాంకేతిక పనుల్లో ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, సంస్కృతీ సంప్రదాయాల వివరాలు, కుటుంబ చిత్రాలు, సంప్రదాయ పాటలు వంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు. ఒక దేశం పూర్తిగా మెటావర్స్‌ సాంకేతికతలోకి మారడం ఇదే తొలిసారి కానుంది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Mar 2023 04:31PM

Photo Stories