Skip to main content

విద్యా రంగంపై ఓరియెంటేషన్.. జిల్లాల వారీగా తేదీలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు–నేడు, జాతీయ విద్యా విధానం అమలు, స్కూళ్ల మ్యాపింగ్ వంటి అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Orientation on the field of education
విద్యా రంగంపై ఓరియెంటేషన్.. జిల్లాల వారీగా తేదీలు ఇలా..

జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజుకు కొన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయం ఐదో బ్లాక్లో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలను అధికారులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓరియెంటేషన్ కార్యక్రమానికి సంబంధిత హెచ్వోడీలు, ఇతర ఉన్నతాధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం–2020తోపాటు ఇతర సమాచారానికి సంబంధించి తెలుగు కాపీలు 200, ఇంగ్లిష్ కాపీలు 200 ప్రజాప్రతినిధులందరి కోసం సమకూర్చాలని కోరారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్యాశాఖ)కి లేఖ రాసింది.

తేదీలు, జిల్లాల వారీగా ఓరియెంటేషన్ కార్యక్రమం ఇలా..

జనవరి 27: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి
జనవరి 28: పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం
జనవరి 29: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం

చదవండి:

Minister of Education: సెలవులపై దుష్ప్రచారం చేస్తే చర్యలు

Schools: ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు ప్రారంభం?

Online Classes: విద్యాశాఖ హడావిడి షెడ్యూల్‌పై విమర్శలు

Published date : 26 Jan 2022 02:21PM

Photo Stories