Skip to main content

Online Classes: విద్యాశాఖ హడావిడి షెడ్యూల్‌పై విమర్శలు

రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు జనవరి 24న ఆన్ లైన్ బోధన అధికారికంగా మొదలైంది.
Online Classes
విద్యాశాఖ హడావిడి షెడ్యూల్‌పై విమర్శలు

ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు 50 శాతం హాజరయ్యారు. టీ–శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు వినాలంటూ విద్యార్థులకు మెసేజ్‌లు పెట్టడం, ఫోన్ చేసి అప్రమత్తం చేయడం వంటి విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆన్ లైన్ క్లాసులు ఎంతమంది విన్నారో తెలుసుకుని పైఅధికారులకు నివేదికలు పంపారు. కాకపోతే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి తెలంగాణ‌ విద్యాశాఖ జనవరి 23న రాత్రి బోధన షెడ్యూల్‌ను హడావుడిగా విడుదల చేయడం విమర్శలకు దారితీసింది. తెల్లవారేసరికే ఈ సమాచారం అందరికీ చేరవేయడం కష్టమైందని టీచర్లు చెప్పారు. రికార్డింగ్‌ పాఠాలు: రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో 8–10 తరగతుల విద్యార్థులు దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. ఈ నెల 8 నుంచి బడులు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లారు. ప్రభుత్వం ఇంతకాలం ఆన్ లైన్ పై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు క్లాసులకు పెద్దగా సిద్ధం కాలేకపోయారు. హడావుడిగా ఆదివారం రాత్రి షెడ్యూల్‌ ఇచ్చి.. దూరదర్శన్, టీ–శాట్‌లో పాఠాల సమయాన్ని ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ గ్రామీణ విద్యార్థులకు సరిగా చేరుకోలేదనే విమర్శలొచ్చాయి. దీంతో వారు మొదటిరోజు పాఠాలు సరిగా వినలేక పోయారు. టీ–శాట్, డీడీ ద్వారా రికార్డింగ్‌ వీడియోల ద్వారా బోధిస్తున్నారు. పాఠంలో సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతోందని విద్యార్థులు వాపోతున్నారు. సర్కారీ బడుల కన్నా, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ విద్యను అందించడంలో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రక్రియను వారం ముందే మొదలు పెట్టినట్టు స్కూళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూళ్లు ఎక్కువగా జూమ్‌ పద్ధతిలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించాయి.

రోజంతా జూమ్‌ క్లాసులు

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జూమ్‌లో క్లాసులు పెడుతున్నారు. ఐదు రోజులుగా క్లాసులు నడుస్తున్నాయి. మాకు డౌట్లు వస్తే అడుగుతున్నాం. కాకపోతే ఐ ప్యాడ్‌లోనే అంతా వినాల్సి వస్తోంది. దీంతో కళ్లు గుంజుతున్నాయి. అలసిపోతున్నట్టుగా అని్పస్తోంది. 
– వి. సాయి కుమార్‌ ప్రైవేటు స్కూలు విద్యార్థి, ఖమ్మం

చదవండి:

Intermediate: టీ–శాట్ ద్వారా ఇంటర్ సిలబస్.. షెడ్యూల్డ్ ఇలా...

Online Courses: ఎడ్టెక్ సంస్థలతో ఆన్ లైన్ కోర్సులు వద్దు

Education: కరోనా వేళ ఇక్కడి విద్యార్థులకు బోధనా విధానాలు భేష్

Published date : 25 Jan 2022 03:10PM

Photo Stories