CM Revanth Reddy: బడి పిల్లలకు 20 వేల ల్యాప్‌టాప్‌లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందించేందుకు క్వాడ్‌జెన్ సంస్థతో కలిసి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు (ఐడబ్ల్యూబీ), విద్యార్థులకు 20 వేల లోపు ల్యాప్‌టాప్‌లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం రాష్ట్రంలో 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం జూలై 2న సచివాలయంలో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చించింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్, నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, పద్మజ, రాజేష్, సీఎస్ రావ్ పాల్గొన్నారు.
Published date : 03 Jul 2024 03:50PM