Skip to main content

NABARD Chairman: ‘అగ్రి బిజినెస్‌’కు అవకాశాలు మెండు

చేవెళ్ల: వ్యవసాయ ఆధారిత రంగాల్లో అగ్రి బిజినెస్‌ విద్యార్థులకు అపారమైన అవకాశాలున్నాయని నాబార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ జీ.ఆర్‌ చింతల అన్నారు.
Opportunities for Agri Business are good
అగ్రి బిజినెస్‌ విద్యార్థులతో డాక్టర్‌.జీఆర్‌ చింతల తదితరులు

మండల పరిధిలోని ఊరేళ్ల సమీపంలో ఉన్న సాగర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్‌లో జూలై 31న‌ అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీడీఎం 15వ బ్యాచ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, వ్యవసాయాధిరిత రంగాల్లో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. విత్తన, గిడ్డంగి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రవాణా, ఈ కామర్స్‌ తదితర రంగాల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగర్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ డబ్ల్యూఆర్‌.రెడ్డి, కార్యదర్శి మాలతి, డైరెక్టర్‌ సురేశ్‌ గిరిమెళ్ల, డీన్‌ డాక్టర్‌ బి.సాహు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాబార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ జీఆర్‌.చింతల

చదవండి:

Acharya NG Ranga Agricultural University: ఫుడ్‌ టెక్నాలజీతో అపార అవకాశాలు

PJTSAU: మరో కోత్త వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ.. డాక్టర్‌ అవినాశ్‌ వనం పేరిట బంగారు పతకం

Published date : 01 Aug 2023 05:01PM

Photo Stories