DIETలో సంస్కృత శిక్షణ కేంద్రం ప్రారంభం
Sakshi Education
తిమ్మాపూర్: కరీంనగర్ ఉపాధ్యాయ వత్తి శిక్షణ సంస్థ(డైట్)లో అనియత సంస్కృత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఎల్‌ఎండీ కాలనీలోని డైట్‌లో సెప్టెంబర్ 6న నిర్వహించిన కార్యక్రమానికి పూర్వ ప్రధానాచార్యులు వేదాంతం లలితాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంస్కృతం భాషలన్నింటికీ తల్లిలాంటిదన్నారు.
దీన్ని నేర్చుకుంటే సంస్కృతి, సంప్రదాయం తెలియడమే కాకుండా ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం ఆమెతోపాటు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కె.శంకర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీరాం మొండయ్య, సంస్కృతం శిక్షక్ కె.రాము, ఛాత్రోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి:
Vitopia 2023 : సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే..
Global Investors Summit: రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టేలా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
Published date : 07 Sep 2023 03:09PM