Vitopia 2023 : సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే..
వివిధ రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలు మేళవించేలా ‘వసుదైకం’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంతర్జాతీయ పారా ఒలింపిక్స్‌కు వాలీబాల్ జట్టు ఎంపికలో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులతో జట్టును ఎంపిక చేశారు.
వివిధ పోటీలలో విజేతలకు..
స్టాండ్ అప్ కమెడియన్స్ రాజశేఖర్ మ ఆమిడన్నా, ఆకాష్ గుప్తా నిర్వహించిన కార్యక్రమం అలరించింది. సాయంత్రం వివిధ పోటీలలో విజేతలకు జాతీయ స్థాయి అవార్డు గ్రహీత, కూచిపూడి కళాకారిణి సంధ్యారాజు, తెలుగు చిత్ర పరిశ్రమ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పద్శశ్రీ కిన్నెర మొగలయ్య గానం అందరినీ ఆకట్టుకుంది. దికిట్ బీట్ బాక్సింగ్ విఐటి–ఏపీ వర్సిటీ విద్యార్థుల గాన ప్రదర్శన, గిరిజన నృత్యాలు అలరించాయి. ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ షణ్ముక ప్రియ గానం విద్యార్థులలో హుషారు రేకెత్తించింది.
వీటిని కాపాడాల్సిన బాధ్యత యువతదే..
పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతరంపై ఉందని పారా ఒలింపిక్స్ ఇండియా వాలీబాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు హెచ్.చంద్రశేఖర్ అన్నారు.
కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత, పద్మశ్రీ హెచ్‌ఎన్ గిరీషా, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత సుక్బీర్ సింగ్, వర్సిటీ వీసీ డాక్టర్ కోటారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.