Skip to main content

ప్రైవేట్‌ వర్సిటీల కోర్సులకు ఫీజులు ఖరారు

రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయనున్న ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్సుల వారీగా ఫీజులను ఖరారు చేసింది.
ప్రైవేట్‌ వర్సిటీల కోర్సులకు ఫీజులు ఖరారు
ప్రైవేట్‌ వర్సిటీల కోర్సులకు ఫీజులు ఖరారు
ఈ మేరకు అక్టోబర్‌ 24న జీఓ 57ను విడుదల చేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (అమరావతి), వీఐటీ ఏపీ (అమరావతి), సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (విజయనగరం), భారతీయ యూనివర్సిటీ ఆఫ్‌ సై¯Œ్స అండ్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ–బెస్ట్‌ (అనంతపురం)లోని బీటెక్, బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో కన్వీనర్‌ కోటాలో విద్యార్థులకు కేటాయించనున్నారు. ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ, సెంచూరియన్ వర్సిటీల్లో బీటెక్‌ కోర్సులకు, బెస్ట్‌ వర్సిటీలో బీటెక్‌తో పాటు బీఎస్సీ కోర్సులకు ప్రవేశాలు కలి్పంచనున్నారు. ఎస్‌ఆర్‌ఎం, వీఐటీలో బీటెక్‌ కోర్సు ఫీజును రూ.70 వేలు, సెంచూరియన్ లో రూ.50 వేలు, బెస్ట్‌ వర్సిటీలో రూ.40 వేలుగా ఖరారు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ సీట్లకు రూ.70 వేలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2021–22 నుంచి 2023–24 వరకు అమల్లో ఉండనున్నాయి. ఈ ఫీజులకు అదనంగా డబ్బు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాస్టల్, ట్రా¯Œ్సపోర్ట్, మెస్‌ చార్జీలు, రిజి్రస్టేషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, లైబ్రరీ, ల్యా»Ÿరేటరీ ఫీజులు ఈ ఫీజులో కలసి ఉండవని పేర్కొంది. కాగా ఈ వర్సిటీల్లో మొత్తంగా 2,330 బీటెక్‌ సీట్లు, బెస్ట్‌ వర్సిటీలో 105 ఏజీ బీఎస్సీ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
Published date : 25 Oct 2021 03:43PM

Photo Stories