Skip to main content

Scholarships: 300 మంది విద్యార్థులకు ఎస్‌ఆర్‌ఎం స్కాలర్‌షిప్స్‌

తమిళనాడు రాష్ట్రం పెరంబలూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన 300 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందజేయనున్నట్లు కట్టన్ కులతుర్‌లోని ఎస్‌ఆర్‌ఎం ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీ) ఫౌండర్‌ చాన్సలర్, పెరంబలూర్‌ ఎంపీ డాక్టర్‌ టీఆర్‌ పారివేందర్‌ తెలిపారు.
Scholarships:
300 మంది విద్యార్థులకు ఎస్ఆర్ఎం స్కాలర్షిప్స్

ఇన్ స్టిట్యూట్‌ ఆవరణలో సెప్టెంబ‌ర్‌ 8న‌ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చి న మాట ప్రకారం ఈ స్కాలర్‌షిప్స్‌ను అందజేయడం జరుగుతోందన్నారు. బలహీన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన 300 మంది విద్యార్థులకు ఎస్‌ఆర్‌ఎం గ్రూప్‌ ఆఫ్‌ ఇన్స్టి ట్యూషన్స్ లో ఉచితంగా విద్యనందిస్తామని తెలియజేశారు. దరఖాస్తులను https://admissions.srmist.edu.in/srmistonline/Perambalur వెబ్‌సైట్‌లో డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు.

Published date : 09 Sep 2021 01:30PM

Photo Stories