Vitopia 2023: అట్టహాసంగా విటోపియా 2023
సాక్షి ఎడ్యుకేషన్, విట్ సంయుక్తంగా పలు ఆటల పోటీలు, సాంస్క`తిక కార్యక్రమాలు నిర్వహించారు. సింగింగ్, స్టాండప్ కామెడీ, ట్రైబల్ డ్యాన్స్, ఫ్యాషన్ షోలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.
చదవండి: రాష్ట్రానికి సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్
అదరగొట్టిన విద్యార్థులు
సింగింగ్ కాంపిటేషన్ ఆద్యతం ఆకట్టుకుంది. విద్యార్థులు తమ గాత్రంతో శ్రోతలను అలరించారు. వారు పాడిన సినీ, ఫోక్ సాంగ్స్‌తో విట్ ప్రాంగణం మార్మోగింది. అనంతరం విద్యార్థులు చేసిన గిరిజన న`త్యాలు ఆకట్టుకున్నాయి. ఈ మధ్య బాగా పాపులర్ అయిన స్టాండప్ కామెడీని విద్యార్థులు అదరగొట్టేశారు. కామెడీ పంచ్‌లకు విరగబడినవ్వారు. చివరగా అమ్మాయిల ఫ్యాషన్ షో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. విద్యార్థినులు తమ అందాలతో కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు.
చదవండి: 20 రంగాల్లో 6 లక్షల ఉద్యోగాలు..
వేడుకగా నాలుగో ఎడిషన్
అమరావతిలో విట్ ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. నాలుగో వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సునీల్ కశ్యప్, డైరెక్టర్ బాబీ కొల్లి, ప్రముఖ నటి పాయల్ రాజ్‌పుత్ తదితరులు హాజరై విటోపియాను హోరెత్తించారు. తన పాటలతో దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకున్నాడు. నాలుగో ఎడిషన్ మొదటిరోజు ఆద్యంతం ఉత్సాహంగా సాగడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.