Vitopia 2023: ఆహ్లాదంగా విటోపియా వార్షికోత్సవం
అనంతరం అంతర్జాతీయ పారా ఒలింపిక్స్‌కు వాలీబాల్ జట్టు ఎంపిక కోసం పోటీ నిర్వహించారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జట్టుగా ప్రపంచ పారా వాలీబాల్‌లో భారతదేశం తరఫున ఆడనున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పారా ఒలింపిక్స్ ఇండియా, వాలీబాల్ ఫెడరేషన్ అధ్యక్షులు హెచ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆయనతో పాటు అర్జున అవార్డు గ్రహీత పద్మశ్రీ హెచ్ ఎన్ గిరీషా, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత సుక్బీర్ సింగ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
ప్రపంచ పారా వాలీబాల్‌కు ఎంపికైన జట్టు ఇదే
అంతోనప్ప(కర్నాటక), హెచ్ ఎన్ గిరీష(కర్నాటక), మోహిత్(హర్యానా), సంజయ్ (హర్యానా), సింధీ(కర్నాటక), ధరణి(కర్నాటక), ప్రతాప్ హెడ్గే(కర్నాటక), గణేష్(ఆంధ్రప్రదేశ్), హొటెస్టర్ సింగ్(హిమాచల్ ప్రదేశ్), అజయ్‌కుమార్(హిమాచల్ ప్రదేశ్), రాజేందర్ సింగ్(హిమాచల్ ప్రదేశ్), రవీందర్(హర్యానా), విజయ్‌కుమార్(హర్యానా).
విజేతలకు అవార్డుల అందజేత
పోటీల అనంతరం స్టాండ్ అప్ కమెడియన్స్ రాజశేఖర్ మామిడన్నా, ఆకాష్ గుప్త కార్యక్రమం అలరించింది. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీల్లో గెలుపొందిన విజేతలకు జాతీయ అవార్డు గ్రహీత, కూచిపూడి కళాకారిణి సంధ్యరాజు, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ అవార్డులు అందజేశారు. ఈ సదర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెల ముగలయ్య, షణ్మఖప్రియ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో విఐటీ-ఏపీ వైస్ చాన్సలర్ డా.కోటారెడ్డి, రిజిస్ట్రార్ డా.జగదీష్ చంద్రముదిగంటి, విటోపియా కన్వీనర్ డా.సుధాకర్ ఇలంగో, స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డా.అనుపమ నంబూరు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.