DEO Srinivas Reddy: హైస్కూల్లో గ్రంథాలయం ప్రారంభం
Sakshi Education
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్లో నవంబర్ 14న డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి బాల చెలిమి గ్రంథాలయం, సైన్సు ల్యాబ్‌లను ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆలోచనా విధానం, జ్ఞానం పెంపొందించుకునేందుకు దోహదపడుతాయన్నారు. పుస్తకాలు చదవడం, రాయడం ఎంతో లాభదాయకమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం సత్తయ్య, ఖైజర్, అశోక్, మనోజ్ పాల్గొన్నారు.
Published date : 15 Nov 2023 04:12PM