Skip to main content

YVU: ‘కళాదర్శన్‌’ ఆర్ట్‌ గ్యాలరీ ప్రారంభం

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ గ్యాలరీ ఓ ప్రత్యేక ఆకర్షణగా సరికొత్త శోభను సంతరించుకుని విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలు పెంచేలా ఉందని వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మునగల సూర్యకళావతి అన్నారు.
YVU
‘కళాదర్శన్‌’ ఆర్ట్‌ గ్యాలరీ ప్రారంభం

అక్టోబర్‌ 31న వైఎస్సార్‌ జిల్లా కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగం ఆధ్వర్యంలో నూతన పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన ‘కళాదర్శన్‌’ ఆర్ట్‌ గ్యాలరీని వీసీ ప్రారంభించారు.ఆమె మాట్లాడుతూ.. రాయలసీమలోనే తొలి ఆర్ట్‌ గ్యాలరీగా వైవీయూ నిలుస్తుందన్నారు.

చదవండి: YVU: వైవీయూలో ఈ పీజీ డిప్లొమా కోర్సులకు అనుమతి

మహానగరాలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దిన అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య డీ విజయరాఘవప్రసాద్, ప్రిన్సిపాల్‌ ఆచార్య కే కృష్ణారెడ్డి, ఆర్ట్‌ గ్యాలరీ ఇన్‌చార్జి డాక్టర్‌ కోట మృత్యుంజయరావు, లలితకళల విభాగాధిపతి డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య పీ పద్మ, డాక్టర్‌ వైపీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

చదవండి: Vishwabhushan Harichandan: నూతన విద్యావిధానంతో సమూల మార్పులు

Published date : 01 Nov 2022 05:22PM

Photo Stories