Skip to main content

Vishwabhushan Harichandan: నూతన విద్యావిధానంతో సమూల మార్పులు

విశ్వవిద్యాలయాలు విలువ ఆధారిత కోర్సుల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ ఉద్బోధించారు.
YVU
విద్యార్థికి పీహెచ్‌డీ పట్టా అందిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ చిత్రంలో వీసీ సూర్యకళావతి, డాక్టర్‌ మోహన్ రెడ్డి

అందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ విద్యా విధానం–2020’ ద్వారా తీసుకొచి్చన మార్పులు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం 9,10వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి రాజ్‌భవన్ నుంచి మార్చి 4న వర్చువల్‌ విధానంలో ఆయన ప్రసంగించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచి్చన నూతన విద్యావిధానం విద్యార్థులకు విలువలు కూడా నేర్పుతోందన్నారు. స్థాపించిన పదిహేనేళ్లలోనే యోగి వేమన వర్సిటీ ఎన్ ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ సాధించిన తొలి 150 విద్యా సంస్థల్లో స్థానం దక్కించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సైయంట్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్ డా.బీవీఆర్‌ మోహన్ రెడ్డికి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ అందించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ఉన్నతవిద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. అన్ని విద్యాసంస్థలకు అక్రెడిటేషన్ తప్పనిసరి చేశామన్నారు. అనంతరం 86 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. 33 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు, 1,074 మంది పీజీ విద్యార్థులు, 6,518 మంది యూజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. 

చదవండి: 

​​​​​​​Education: విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం

Higher Education Department: ఉపాధి కల్పించేలా కోర్సులు!

Education: వయోజనుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రాజెక్ట్‌

Published date : 05 Mar 2022 12:42PM

Photo Stories