Education: వయోజనుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రాజెక్ట్
ఇందుకోసం ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్’ పేరిట కొత్త కార్యక్రమానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో అమలు చేసిన వయోజన విద్యా పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని పలు నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త పథకాన్ని చేపట్టినట్లు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. గతంలో అమలు చేసిన వయోజన విద్యా పథకాలు కేవలం కొన్ని పార్శా్వలకే పరిమితం కావడంతో సరైన ఫలితాలు రాలేదని తేలిన నేపథ్యంలో కార్యక్రమాన్ని వయోజనులకే పరిమితం చేయకుండా 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క నిరక్షరాస్యుడినీ ఈ కొత్త కార్యక్రమం పరిధిలోకి తెచ్చి అక్షరాస్యుడిగా తీర్చిదిద్దనున్నారు.
జీవన నైపుణ్యాలపైనా దృష్టి
21వ శతాబ్దపు పౌరులకు అవసరమైన ఆరి్థక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ, నూతన అంశాలపై అవగాహన, జీవిత నైపుణ్యాలు వంటి ఇతర అంశాల్లోనూ సంపూర్ణ అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కళలు, శా్రస్తాలు, సాంకేతికత, సంస్కృతి, క్రీడలతో పాటు సంపూర్ణమైన వయోజన విద్యా కోర్సులను ఈ కార్యక్రమం కింద అమలు చేస్తారు. జీవిత నైపుణ్యాలపై మరింత అవగాహన కోసం అధునాతన మెటీరియల్‌ను అందిస్తారు. ఈ పథకాన్ని వలంటీర్ల ద్వారా అమలు చేయనున్నారు. ఆన్ లైన్ మోడ్ ద్వారా వలంటీర్లకు శిక్షణ ఉంటుంది. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న అక్షరాస్యులు కాని వారికి వర్తిస్తుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఎన్ సీఈఆరీ్ట, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ తదితర సంస్థల సహకారంతో ఈ పథకం అమలు కానుంది. ఆన్ లైన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్‌మెంట్ విధానాలను అనుసరిస్తారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.1,037.90 కోట్లు. ఇందులో 2022–27కి వరుసగా రూ.700 కోట్లను కేంద్రం సమకూర్చనుండగా, రాష్ట్రాలు తమ వాటాగా రూ.337.90 కోట్లు వెచి్చంచాల్సి ఉంటుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
చదవండి:
AICTE: కోర్సులకు పాక్షిక అనుమతులుండవు
Anganwadi: పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రాష్ట్ర ప్రభుత్వం