AICTE: కోర్సులకు పాక్షిక అనుమతులుండవు
ఈ మేరకు అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు సర్క్యులర్ పంపించింది. ఇప్పటివరకు పలు యూనివర్సిటీలు ఏఐసీటీఈ పాక్షిక అనుమతులున్నాయంటూ వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వర్సిటీయేతర విద్యాసంస్థలు కూడా ఇదే విధంగా కోర్సులను అమలు చేస్తూ.. విద్యార్థులకు ప్రవేశాలు కలి్పస్తున్నాయి. చివరకు పూర్తి అనుమతులు రాకుంటే ఆ కోర్సులు చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దీంతో ఈ ప్రక్రియ గందరగోళంగా ఉందంటూ ఫిర్యాదులు అందడంతో పాక్షిక అనుమతుల విధానాన్ని తొలగిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై యూనివర్సిటీలు కొత్త కోర్సులు, డిపార్టుమెంట్ల ప్రారంభానికి ఏఐసీటీఈ నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. లేదంటే స్వయం ప్రతిపత్తి గల వర్సిటీలు సొంతంగా కూడా కోర్సులు, డిపార్టుమెంట్లు ప్రారంభించుకోవచ్చని సూచించింది. స్వయం ప్రతిపత్తి ఉన్న వర్సిటీలు కొత్త కోర్సులు, డిపార్టుమెంట్లను ప్రారంభించడానికి సొంతంగానే నిర్ణయం తీసుకోవచ్చని, దానికి ఏఐసీటీఈ అనుమతులు అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశాలను సర్క్యులర్‌లో పొందుపరిచింది. ఆయా కోర్సులు, ప్రోగ్రాముల నిర్వహణలో ఏఐసీటీఈ విధివిధానాలను పాటించాల్సిందేనంది. అనుబంధ కాలేజీల్లో ఆయా కోర్సుల నిర్వహణకు సంబంధించి ఏఐసీటీఈ నిబంధనలు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత యూనివర్సిటీలపైనే ఉందని గుర్తుచేసింది. వర్సిటీయేతర ఇతర ఉన్నత విద్యాసంస్థలు మాత్రం ఆయా కోర్సుల నిర్వహణకు సంబంధించి ఏఐసీటీఈ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
చదవండి:
Education: ఉన్నత విద్యకూ ‘విద్యాంజలి’
AICTE Scholarship: ఈ పథకానికి ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేలు...