YVU: వైవీయూలో ఈ పీజీ డిప్లొమా కోర్సులకు అనుమతి
Sakshi Education
Yogi Vemana University జర్నలిజం శాఖ ఆధ్వర్యంలో Post Graduate Diploma in Public Relations (PGDPR), Post Graduation Diploma in Telugu Journalism (PGDTJ) కోర్సుల నిర్వహణకు అనుమతి లభించింది.
ముద్రణ, దృశ్యశ్రవణ మాధ్యమాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల్లో ప్రజా సంబంధాల అధికారులు, మీడియా కన్సల్టెంట్‌లుగా చేరేందుకు విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది. విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి.విజయరాఘవప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో ఈ కోర్సులు అందుబాటులోకి వచ్చినట్లు వైవీయూ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ శాఖ సమన్వయకర్త డాక్టర్ తమ్మినేని శ్యామ్‌స్వరూప్ అక్టోబర్ 12న తెలిపారు. 2022–23 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు.
చదవండి:
Career Guidance: సరికొత్త కెరీర్ మార్గంగా డిజిటల్ జర్నలిజం.. ప్రారంభంలో రూ.20 వేల వేతనం..
Published date : 13 Oct 2022 05:09PM