Andhra Pradesh: ‘జగనన్న విద్యా దీవెన’కు ఉమ్మడి ఖాతా తెరవండి
Sakshi Education
అనంతపురం సిటీ: జగనన్న విద్యా దీవెన నాల్గో విడత పథకం లబ్ధి కోసం విద్యార్థి, తల్లి పేరుతో జాయింట్ ఖాతా తప్పనిసరిగా తెరవాలని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి(డీఎల్‌డీఓ) చిలంకూరు ఓబుళమ్మ తెలిపారు.
నవంబర్ 11న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. నవంబర్ 28న జగనన్న విద్యా దీవెన నాల్గో విడత నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
చదవండి: AP Government Scheme: జగనన్న గోరుముద్ద పథకం ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా..
విద్యార్థి, తల్లి పేరుతో ఉమ్మడి బ్యాంక్ ఖాతా ఉంటేనే జగనన్న విద్యా దీవెన నాల్గో విడత లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్సీ విద్యార్థులకు జాయింట్ ఖాతా అవసరం లేదన్నారు. అలాగే 2022–23 చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకూ ఉమ్మడి ఖాతా అవసరం లేదన్నారు.
Published date : 13 Nov 2023 11:38AM