ఇక నుంచి డిగ్రీ నాలుగేళ్లు
విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సమావేశం విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయం సీడీసీ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న జరిగింది. వైస్ చాన్స్‌లర్ రామమోహనరావు మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా విశ్వవిద్యాలయం పరిధిలో పలు సంస్కరణలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ కోర్సును నాలుగేళ్ల కాల పరిమితికి పెంచుతున్నా మని పేర్కొన్నారు. నాలుగో ఏడాదికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తుందని వివరించారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ
Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్
విద్యార్థులను పారిశ్రామిక రంగానికి చేరువ చేయడంతో పాటుగా వారిలో వృత్తినైపుణ్యాలను పెంపొందించేందుకు ఇంటర్న్‌షిప్ విధానం దోహదపడుతుందన్నారు. ఇంటర్న్‌షిప్‌కు మార్కులు కేటాయించే అంశంపై సైతం త్వరలోనే విధివిధానాలను వెల్లడవుతా యని తెలిపారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సమష్టిగా చర్యలు తీసుకొని ముందుకు సాగడానికి అండగా ఉండాలని కళాశాలలను కోరారు. వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా కృష్ణా విశ్వవిద్యాలయం సైతం తన పరిధిలోని కళాశాలలను మరింత బలోపేతం చేస్తోందని రిజిస్ట్రార్ ఆచార్య ఎం.రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సీడీసీ డీన్ డాక్టర్ డి.రామశేఖరరెడ్డి నిర్వహించారు. అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఆర్.విజయకుమారి, కేబీఎన్ కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.