ANGRAU: ఎన్జీ రంగా వర్సిటీ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.పూర్ణిమ నవంబర్ 15న ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ నుంచి చిరుధాన్యాలు, వర్మికంపోస్ట్, సెరికల్చర్, బయోఫెర్టిలైజర్స్ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కోర్సుల వ్యవధి 8 వారాలు అని పేర్కొన్నారు. ఆసక్తిగల యువత, మహిళలు, నిరుద్యోగులు ఒక్కో కోర్సుకు రూ.1,500 ఫీజు చెల్లించి డిసెంబర్ ఒకటో తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్ లేదా కంప్యూటర్ కలిగి ఉండాలన్నారు.
చదవండి: ‘ఐసీఏఆర్’ ర్యాంకింగ్స్ లో బెస్ట్ యూనివర్సిటీలు ఇవే
మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ను గానీ 8008788776, 8309626619, 9110562727 సెల్ నంబర్లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గానీ సంప్రదించాలని సూచించారు. ఈ కోర్సులు పూర్తి చేసినవారు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
Published date : 16 Nov 2022 03:01PM