ఎన్జీ రంగా వర్సిటీతో ఎంవోయూ.. ఎందుకంటే..
Sakshi Education
గుంటూరు రూరల్: సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుని అధునాతన టెక్నాలజీతో అందరం ముందుకు సాగాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎ.విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.
గుంటూరు శివారులోని లాంఫాం విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఒప్పంద సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంసెట్ ఆధారంగా నిర్వహించే అడ్మిషన్లు నేరుగా విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించేవారమని, ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో ఏర్పాటు చేశామన్నారు. అడ్మిషన్లు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతాయని, విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రానక్కర్లేదన్నారు. అనంతరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఇచ్చి పుచ్చుకున్నారు.
Published date : 21 Nov 2020 04:45PM