New Education System: నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
ఆగష్టు 1న ఆలిండియా విశ్వవిద్యాలయాల కళాశాలల అధ్యాపక సంఘం సమాఖ్య, విశ్రాంత కళాశాలల అధ్యాపక సంఘం సమాఖ్య పిలుపు మేరకు నల్లగొండ పట్టణంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గోనారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అశాసీ్త్రయమైన విద్యావిధానాన్ని ముందుకు తీసుకొస్తుందని, ఇది భారతదేశ పరిస్థితులకు ఏమాత్రం అనువైనది కాదని అన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ విద్యావిధానాన్ని మార్చి వేస్తూ కేంద్రం ఊహాజనితమైన అంశాలను విద్యార్థుల్లో చొప్పించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
చదవండి: Biopots: ‘బయోపాట్స్’ ప్రాజెక్టుకు బహుమతి
మూఢనమ్మకాలతో కూడిన విద్యావిధానం కేంద్రం తీసుకొస్తుందని దీనిని వ్యతిరేకించాల్సిన బాధ్యత దేశంలోని సకల జనులపై ఉందన్నారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, విద్యారంగ నిపుణులతో చర్చించి ప్రజలకు అనుకూలమైన శాసీ్త్రయమైన విద్యావిధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రముఖ పట్టణాలలో చర్చావేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు మందడి నర్సిరెడ్డి, ఆర్. విజయ్‌కుమార్, బండి రాఘవరెడ్డి, అక్కెనపల్లి మీనయ్య, దండా వెంకట్రామ్‌రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం బాధ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, విద్యావంతులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.