Skip to main content

Biopots: ‘బయోపాట్స్‌’ ప్రాజెక్టుకు బహుమతి

రేగిడి: రేగిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని జి.లావణ్య రూపొందించిన ‘బయోపాట్స్‌’ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కన్సోలేషన్‌ బహుమతి సాధించిందని పాఠశాల హెచ్‌ఎం వావిలపల్లి లక్ష్మణరావు జూలై 31న‌ తెలిపారు.
Biopots project
‘బయోపాట్స్‌’ ప్రాజెక్టుకు బహుమతి

గీతా యంగ్‌ సైంటిస్టు ఫౌండేషన్‌ నిర్వహించిన జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించారు. పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయిని బూరవెల్లి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థిని జూన్‌ 6న ఆన్‌లైన్‌లో ప్రాజెక్టును సబ్‌మిట్‌చేసింది.

చదవండి: No Admissions: అడ్మిషన్లు ఫుల్‌

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల నుంచి 32 ప్రాజెక్టులు తుది పోటీలకు ఎంపికకాగా, అందులో బయోపాట్స్‌ ప్రాజెక్టుకు కన్సోలేషన్‌ బహుమతి వచ్చింది. బాలికను ఎంఈఓలు ఎం.వి. ప్రసాదరావు, బి.ఎరకయ్య, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

చదవండి: Classroom Based Assessment: చదువులపై మదింపు

Published date : 01 Aug 2023 04:08PM

Photo Stories