No Admissions: అడ్మిషన్లు ఫుల్
‘పది’లో మెరుగైన ఉత్తీర్ణత..
కేజీబీవీల్లో ఈ సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షలకు మొత్తం 524 మంది విద్యార్థులు హాజరుకాగా ఏడుగురు గైర్హాజరయ్యారు. 517 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 403 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా లింగాపూర్ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించింది. గత విద్యాసంవత్సరంలో 486 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 425 మంది ఉత్తీర్ణత సాధించారు.
పెంచికల్‌పేట్, బెజ్జూర్, మోడి(కెరమెరి), జైనూర్‌లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని 12 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ విద్య అందుబాటులో ఉంది. ఆసిఫాబాద్, రెబ్బెన, దహెగాం, చింతలమానెపల్లి, కెరమెరి, సిర్పూర్(యూ), కాగజ్‌నగర్‌లో బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో, జైనూర్, సిర్పూర్(టి), బెజ్జూర్, వాంకిడిలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
చదవండి: Department of School Examinations: ‘ఎలిమెంటరీ ఎడ్యుకేషన్’ ప్రాక్టికల్స్ తేదీలు ఇవే..
దహెగాం(సిర్పూర్): చిన్నవయస్సులోనే బాలకార్మి కులుగా మారుతున్న బాలికలు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించింది. ఏటా ఉత్తమ ఫలితాలతో కేజీబీవీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
మెరుగైన విద్య, వసతులు లభిస్తుండటంతో బాలికలు కస్తూరి బా విద్యాలయాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో 2023–24 విద్యాసంవత్సరంలో జిల్లాలోని పలుచోట్ల ప్రవేశాలు వందశాతం పూర్తయ్యాయి. లింగాపూర్, తిర్యాణి కేజీబీవీల్లో మాత్రమే ప్రస్తుతం సీట్లు ఉన్నట్లు ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ప్రకటించారు.
చదవండి: Student Association: స్కూళ్లలో సంఘాలకు నో ఎంట్రీ
మండలానికో విద్యాలయం..
రాష్ట్ర ప్రభుత్వం 2004లో కస్తూరిబా విద్యాలయాలను ఏర్పాటు చేయగా 2005 జూలై నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 15 కేజీబీవీలు కొనసాగుతున్నాయి. సుమారు 3,050 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు ఈ ఏడాది వేసవి నుంచే ప్రవేశాలు ప్రారంభించారు.
ఏప్రిల్, మే నెలల్లో కస్తూరిబా గాంధీ స్పెషల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు స్వయంగా గ్రామాలకు వెళ్లి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. బడి మానేసిన, అనాథ, నిరుపేద విద్యార్థులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రులు, సంరక్షకులకు అవగాహన కల్పించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు పోటీ ఏర్పడింది.
వందశాతం ప్రవేశాలు..
జిల్లాలోని 15 కేజీబీవీల్లో తిర్యాణి, లింగాపూర్ మిన హా అన్ని మండలాల్లో ఇప్పటికే వందశాతం ప్రవేశాలు పూర్తయ్యాయి. బడి మానేసిన, తల్లిదండ్రులు లే ని నిరుపేద విద్యార్థులు ఉంటే మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. గతంలో కేజీబీవీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రవేశాలకు విద్యార్థులు వెనుకాడే వారు.
ప్రస్తుతం కేజీబీవీలకు విశాలమైన భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. మహిళా ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన గ్రామీణ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీలు, మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులకు కేజీబీవీలు చదువుల నిలయాలుగా మారాయి.
అడ్మిషన్లకు పోటీ
జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయి. లింగాపూర్, తిర్యాణిలో మాత్ర మే వందశాతం ప్రవేశాలు పూర్తి కాలేదు. ఎవరైనా డ్రాపౌట్, అనాథ పిల్లలు, నిరుపేదలు ఉంటే తిర్యా ణి, లింగాపూర్ కేజీబీవీల్లో ప్రవేశం కల్పిస్తాం. వేసవిలో ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి డ్రాపౌట్ విద్యార్థినులను గుర్తించారు. ఆహ్లాదకరమైన వాతా వరణం ఉండడంతో అడ్మిషన్లకు పోటీ నెలకొంది.
– అశోక్, డీఈవో