VIT-AP: విశ్వవిద్యాలయం ఆధ్వర్యమలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
భారతదేశంలోని 16 రాష్ట్రాల నుండి సుమారు 16 పాఠశాలలు, కళాశాలల నుండి 400 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం యొక్క శాస్త్రీయ, సాంకేతిక కార్యకలాపాలను వివరించడానికి, ప్రాథమిక శాస్త్రాలలో కొన్ని అంశాలను ప్రదర్శించడానికి అనేక శాస్త్రీయ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రోజంతా పుస్తక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రొఫెసర్ సి.వి. రామన్ నోబెల్ బహుమతిని గెలుచుకోవడానికి దారితీసిన రామన్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణను గుర్తుచేస్తూ సాగింది.
చదవండి: యూజీ, పీజీ కోర్సుల్లో వీఐటీ మెరిట్ స్కాలర్‌షిప్స్
ఈ సందర్భంగా పద్మశ్రీ డా. బి.వి.ఆర్. మోహన్ రెడ్డి (సైయింట్ వ్యవస్థాపక చైర్మన్, బోర్డు -సభ్యుడు) మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలలో కొత్త ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇది కొత్త ఆసక్తులను కొనసాగించేలా చేస్తూ, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది తెలియచేసారు.
చదవండి: వీఐటీ–స్కిల్ లింక్ మధ్య అవగాహన ఒప్పందం
డా. ఎస్. వి. కోటా రెడ్డి (వైస్-ఛాన్సలర్, విఐటి -ఏపి విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ, సమస్య యొక్క -సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి పరిశోధన విలువైన సాధనం కాబట్టి నూతన పరిశోధనల కోసం ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని అన్నారు. పరిశోధన ప్రచురణలు, పేటెంట్ల విషయంలో భారత్ 5వ స్థానంలో ఉన్నప్పటికీ, చైనా, అమెరికాలతో పోల్చితే భారత్ ఏటా ప్రచురిస్తున్న పరిశోధన ప్రచురణల సంఖ్య తక్కువేనని చెప్పారు. 2022లో భారతదేశం నుండి ప్రచురించిన పరిశోధన ప్రచురణలు, పేటెంట్లు గణాంకాలు తెలియచేసారు.
చదవండి: వీఐటీ–ఏపీ, జేఎన్‌సీఏఏ మధ్య ఎంవోయూ
ఈ కార్యక్రమంలో డా. జగదీష్ చంద్ర ముదిగంటి (రిజిస్ట్రార్, విఐటి -ఏపి విశ్వవిద్యాలయం), డా. శాంతను మండల్ (డీన్, స్కూల్ అఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, విఐటి -ఏపి విశ్వవిద్యాలయం), డా. ఎస్. శ్రీనివాస్ (ప్రొఫెసర్, స్కూల్ అఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, విఐటి -ఏపి విశ్వవిద్యాలయం) డా. అమిత్ చవాన్ (డైరెక్టర్, ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్, ఎంట్రపరెన్యూర్ సెల్, విఐటి -ఏపి విశ్వవిద్యాలయం), విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.