Skip to main content

వీఐటీ–స్కిల్‌ లింక్‌ మధ్య అవగాహన ఒప్పందం

సాక్షి, అమరావతి: తమకు, స్కిల్‌ లింక్‌ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎస్వీ కోటారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఎంవోయూ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అధ్యాపకులు, విద్యారులు స్కిల్‌ లింక్‌ ట్రైనింగ్, ధ్రువపత్రాలు పొందడానికి ఈ ఒప్పందం సాయపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు కోర్సును విజయవంతంగా పూర్తి చేయడానికి, సమగ్ర అభ్యాస నిర్వహణ వ్యవస్థకు అనుగుణంగా స్కిల్‌ లింక్‌ కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు నైపుణ్యాలను పెంచడానికి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా వారిని సిద్ధం చేయడానికి ఈ అవగాహన ఒప్పందం సహకరిస్తుందని స్కిల్‌ లింక్‌ సీఈవో, కో ఫౌండర్‌ సూర్యనారాయణ్‌ పన్నీర్‌ సెల్వన్‌ తెలిపారు.

చ‌ద‌వండి: జూలైలో నిర్వహించనున్న యూపీఎస్సీ పరీక్షలు ఇవే..

చ‌ద‌వండి: ఏపీ పీజీసెట్: ఇక అన్ని వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష
Published date : 17 Jul 2021 03:19PM

Photo Stories