Skip to main content

వీఐటీ–ఏపీ, జేఎన్‌సీఏఏ మధ్య ఎంవోయూ

అమరావతి: వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం, జునిపెర్‌ నెట్‌వర్క్‌ క్లౌడ్‌ అండ్‌ ఆటోమేషన్‌ అకాడమీల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) సంతకం కార్యక్రమం మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగింది.
ఈ సందర్భంగా వీఐటీ–ఏపీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రోగ్రాం అధ్యాపకులకు, విద్యార్థులకు జునిపెర్‌ ట్రైనింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ పొందటానికి సహాయపడుతుందని అన్నారు. క్లౌడ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ రంగంలో పరిశోధన, కెరీర్‌ అవకాశాలతో కూడిన 10 ఇండస్ట్రీ డిమాండ్‌ కోర్సులలో శిక్షణ మరియు సర్టిఫికేషన్‌ పొందవచ్చని తెలిపారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం నుంచి జునిపెర్‌ ప్రోగ్రామ్‌ సర్టిఫికేట్‌ పొందిన విద్యార్థులకు సూపర్‌ డ్రీం నియామక సమయంలో జునిపెర్‌ బృందం అదనపు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
Published date : 26 May 2021 02:07PM

Photo Stories